రోజు రోజుకు అందాన్ని తింటుందా అన్నట్టు మరింత హాట్ గా తయారవుతున్న శ్రియ..! ఫోటోలు వైరల్

by Kavitha |   ( Updated:2024-05-04 10:39:11.0  )
రోజు రోజుకు అందాన్ని తింటుందా అన్నట్టు మరింత హాట్ గా తయారవుతున్న శ్రియ..! ఫోటోలు వైరల్
X

దిశ,సినిమా: 2001లో ‘ఇష్టం’ మూవీ తో మొదలు అయి తెలుగు పరిశ్రమలో ఒకప్పుడు శ్రియ శరన్ ఒక వెలుగు వెలిగింది. తర్వాత పెళ్లి జరిగి ఓ బిడ్డకు తల్లిగా అయినటువంటి ఈమె పెద్ద ఎత్తున అందాలను ఆరబోస్తూ సందడి చేస్తున్నారు. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి శ్రియ కేవలం సౌత్ సినిమాల్లో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

అయితే ఈమె రోజురోజుకు హాట్ డ్రెస్సుల్లో ఘాటు పోజులతో ఫోటోలు దిగుతూ నెట్టింట షేర్ చేస్తూ యూత్‌లో ఒక క్రేజ్‌ని సంపాదించుకుంటుంది. తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వయసు పెరిగేకొద్దీ హీరోయిన్స్ లుక్ మారిపోయి అందం తగ్గిపోతుంది. కానీ ఈ భామకు మాత్రం పెళ్లై, తల్లైన తర్వాత కూడా రోజురోజుకు మరింత అందం పెరుగుతుంది అని చెప్పడంలో అతియోశక్తి లేదు. సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ ఈ వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు పోటీని ఇస్తూ రోజు రోజుకు అందాన్ని తింటుందా అన్నట్లు మరింత హాట్ గా మారుతుంది. సోషల్ మీడియాలో శ్రియ షేర్ చేసిన పిక్స్ చూసి ఈమెపై ఏజ్ ని తిప్పి కొడుతోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి మీరు కూడా ఆ హాట్ ఫోటోలపై ఒక లుక్ వేయండి.

కాగా, ఇటీవల ‘మ్యూజిక్ స్కూల్’ టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన ‘కబ్జా’ మూవీలో లీడ్ హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టుల లో నటిస్తుంది..

Read More..

హీరోయిన్‌పై పగ పెంచుకున్న చిరంజీవి పెద్దకూతురు.. ఇండస్ట్రీలోనే లేకుండా చేయాలనుకుందా?

Advertisement

Next Story