కొంప ముంచేసిన శ్రీ లీల.. ఇంతకి తెగించేసిందేంటి అని షాక్‌లో ఫ్యాన్స్..

by Kavitha |   ( Updated:2024-05-08 06:53:24.0  )
కొంప ముంచేసిన శ్రీ లీల.. ఇంతకి తెగించేసిందేంటి అని షాక్‌లో ఫ్యాన్స్..
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శ్రీ లీల అనతి కాలంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుని.. మొన్నటి వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా.. స్టార్ హీరోలతో కూడా నటించి దుమ్మురేపింది. కానీ, ఇటీవల ఈ అమ్మడు నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్‌గా నిలిచాయి. దీంతో శ్రీ లీల గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయినట్లు అయింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.

ఈ క్రంమలోనే శ్రీలీల తాజాగా కోలీవుడ్‌లో తండ్రి వయసున్న స్టార్ హీరో అజిత్‌తో ఓ సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా దళపతి విజయ్‌ ప్రస్తుతం ‘గోట్‌(గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌)’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కాగా.. ఇందులో ఓ ఐటెమ్‌ సాంగ్‌ కూడా చేయబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అయింది . కాగా ఇదే సమయంలో ప్రస్తుతం మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

హాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న శింబుతో శ్రీ లీల స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అన్న వార్త వైరల్ గా మారింది . గతంలో శింబు తనతో వర్క్ చేసిన హీరోయిన్స్ తో ఎలా ఎఫైర్స్ మెయింటైన్ చేశారు అనేది అందరికీ తెలిసిందే . అన్ని తెలిసిన శ్రీ లీల ఎలా శింబుతో సినిమాను ఓకే చేసింది అంటూ మండి పడుతున్నారు జనాలు. అయితే ఆమెకు ఆఫర్స్ రావడం లేదు అన్న ఫ్రస్టేషన్‌లోనే ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది అని ఫ్యాన్స్ అంటున్నారు.






Advertisement

Next Story