పెళ్లిపై Shraddha Kapoor రియాక్షన్.. అప్పుడే చేసుకుంటానంటూ ఆసక్తికర కామెంట్స్ (వీడియో)

by Hamsa |   ( Updated:2024-07-20 06:31:20.0  )
పెళ్లిపై Shraddha Kapoor రియాక్షన్.. అప్పుడే చేసుకుంటానంటూ ఆసక్తికర కామెంట్స్ (వీడియో)
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు శక్తి కుమార్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయి పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఆషికీ మూవీతో అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించి వీపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం శ్రద్దా కపూర్ స్త్రీ-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా 2018లో వచ్చిన స్త్రీకి సీక్వెల్‌గా తెరకెక్కనుంది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు, పంకజ్, అభిషేక్ బెనర్జీ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

అయితే ఇటీవల స్త్రీ-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇందులో శ్రద్దా కపూర్ హాజరై సందడి చేసింది. అయితే ఈ కార్యక్రమంలో కొందరు అభిమానులు శ్రద్దా పెళ్లి గురించి అడిగారు. మీరు పెళ్లి కూతురు ఎప్పుడు అవుతారు అని అడిగాడు. దానికి ఈ అమ్మడు షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ‘‘ ఒక స్త్రీ.. తనకు ఎప్పుడు నచ్చితే అప్పుడే పెళ్లి చేసుకుంటుంది’’ అని సమాధానం ఇచ్చింది. తనకు నచ్చినప్పుడు చేసుకుంటానని చెప్పడంతో అక్కడున్న వారంతా కేకలు పెట్టారు. ప్రస్తుతం శ్రద్దా కపూర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, ఈ అమ్మడు గత కొద్ది కాలంగా రాహుల్ మోడీతో రిలేషన్‌లో ఉన్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా వైరల్ కావడంతో ప్రేమలో ఉన్నట్లు అంతా ఫిక్స్ అయిపోయారు. ఈ క్రమంలోనే శ్రద్దా కూడా రాహుల్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. అలాగే ఇటీవల జరిగిన అనంత్ అంబానీ పెళ్లికి కూడా వీరిద్దరు జంటగా హాజరై సందడి చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరి రిలేషన్ పెళ్లి వరకు వస్తుందా? లేదా అని నెటిజన్లు అయోమయంలో పడిపోయారు.

(Video Link Credits To Instant Bollywood Instagram Channel)

Advertisement

Next Story

Most Viewed