రాహుల్‌తో ప్రేమాయణం నడుపుతున్న ప్రభాస్ హీరోయిన్

by Anjali |   ( Updated:2023-07-04 15:21:14.0  )
రాహుల్‌తో ప్రేమాయణం నడుపుతున్న ప్రభాస్ హీరోయిన్
X

దిశ, సినిమా: ‘సాహో’లో ప్రభాస్‌కు జోడీగా నటించిన శ్రద్ధా కపూర్.. ఇంతకు ముందు చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి కొన్నాళ్ల క్రితం బ్రేకప్ చెప్పేసింది. అయితే తాజాగా మరో వ్యక్తితో లవ్‌లో పడినట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా ‘తు ఝూటీ మై మక్కార్’ ద్వారా హిట్ అందుకున్న బ్యూటీ.. ఆ మూవీ రచయిత రాహుల్‌తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసే ఉండటం ఈ గాసిప్స్‌కు ఊతమిస్తుండగా.. ఈ ప్రేమ కథ నిజమేనా? అసలు ఎంత వరకు కొనసాగుతుంది? అనేది చూడాలి మరి.

Read More..

మెగా డాటర్ విడాకులు నిజమే.. కూకట్‌పల్లి కోర్టులో పిటిషన్ వేసిన నిహారిక!

Advertisement

Next Story

Most Viewed