- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shocking : బిగ్‌బాస్ హోస్టింగ్ చేయలేనంటూ హీరో పోస్ట్.. కొత్త హోస్ట్ ఎవరూ?
దిశ, సినిమా: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవలవ ‘ఇండియన్ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇక కమల్ హాసన్ సినిమాలతోనే కాకుండా.. రియలిలీ షో బిగ్‌బాస్‌కు హోస్టింగ్ చేస్తూ.. బుల్లితెర ప్రేక్షకులకు కూడా ఆకట్టుకుంటున్నాడు. ఆయన హోస్టింగ్ కోసం బిగ్‌బాస్ చూసే వారు ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి వారికి ఇది ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఇకపై ఆయన బిగ్‌బాస్‌కు హోస్టింగ్ చెయ్యనంటూ ఓ పోస్ట్ పెట్టాడు.
అందులో.. ‘ప్రియమైన వీక్షకులారా.. బరువెక్కిన హృదయంతో.. 7 సంవత్సరాల క్రితం ప్రారంభమైన మన ప్రయాణం నుండి నేను చిన్న విరామం తీసుకుంటున్నానని మీకు తెలియజేస్తునందుకు చాలా బాధకరంగా ఉంది. ముందస్తు సినిమా కమిట్‌మెంట్‌ల కారణంగా, నేను బిగ్‌బాస్ తమిళ్ రాబోయే సీజన్‌ని హోస్ట్ చేయలేకపోతున్నాను. బుల్లితెర ద్వారా మీ ఇళ్లలో మిమ్మల్ని చేరుకోవడం నాకు గొప్ప అదృష్టం. మీరు నాపై కురిపిస్తున్న ప్రేమ, ఆప్యాయతకు నేను మీకు ఎప్పటికీ కృతజ్ఞతుడుని. బిగ్‌బాస్ తమిళ్‌ను భారతదేశంలోని ఉత్తమ టెలివిజన్ రియాలిటీ షోలలో ఒకటిగా మార్చడంలో పోటీదారుల యొక్క ఉత్సాహభరితమైన, ఉద్వేగభరితమైన మద్దతు చాలా ప్రధానమైనది.
వ్యక్తిగతంగా, మీ హోస్ట్‌గా ఉండటం ఒక సుసంపన్నమైన సంఘం. ఇక్కడ నిజాయితీగా నా నిర్ణయాలను పంచుకున్నారు. మీలో ప్రతి ఒక్కరికీ అలాగే పోటీదారులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సీజన్ మరో విజయాన్ని సాధిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను’ అంటూ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ కావడంతో.. కమల్ హాసన్ ఫ్యాన్స్, బిగ్‌బాస్ లవర్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.