- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shobhitha Dhulipala: నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్.. అరుదైన ఘనత సాధించిన అక్కినేని కోడలు
దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వీరిద్దరి కాపురం మున్నాళ్ల ముచ్చటగా పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక అప్పటి నుంచి ఎవరి లైఫ్ వాళ్లు చూసుకుంటున్నారు. మయోసైటీస్ కారణంగా ఇన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న ఈ సమంత.. ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఇక నాగచైతన్య మాత్రం ‘తండేల్’ మూవీతో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే విడాకుల తర్వాత నాగ చైతన్య.. శోభిత ధూళిపాళతో రిలేషన్లో ఉన్నాడంటూ వచ్చిన వార్తలను నిజం చేస్తూ తాజాగా చైతన్య యంగ్ బ్యూటీ శోభితతో నిశ్చితార్థం చేసుకున్నాడు.
ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున ట్విట్టర్ వేదికగా ఆగస్టు 8న ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. ఇక అప్పటి నుంచి వీరి ఫొటోలతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఎక్కడ చూసినా వీరిద్దరి ఎంగేజ్మెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో.. శోభిత ధూళిపాళ గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈమెకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయపడ్డది. ఇంతకీ అదేమిటంటే? ఈ వారం IMDb ఇండియన్ పాపులర్ సెలబ్రీటీల జాబితాలో షారుఖ్ ఖాన్‌ను పక్కకు నెట్టి ఈ బ్యూటీ రెండో స్థానం సొంతం చేసుకున్నారు. కాగా ముంజ్యా, మహారాజ్ సినిమాలతో క్రేజ్ సాధించిన బాలీవుడ్ నటి శార్వరి మొదటి స్థానంలో ఉండగా.. షారుక్, కాజోల్, జాన్వీ కపూర్ వంటి బాలీవుడ్ యాక్టర్స్ 3,4,5 స్థానాల్లో ఉన్నారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ అంతా మా చైతన్య బ్రో తో నిశ్చితార్థం చేసుకున్న వేళా విశేషం అని అంటుండగా.. మరికొందరు మాత్రం ఒక తెలుగమ్మాయి ఆ ఘనత సాధించడం నిజంగా గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read More..
షాకింగ్ నిర్ణయం తీసుకున్న సమంత! చైతన్య శోభిత నిశ్చితార్థం తర్వాత అక్కడికి వెళ్లి పోతున్న సామ్?