పుష్ప2లో ఎప్పుడూ చూడని విధంగా శోభనం సీన్.. అల్లు అర్జున్, రష్మికల రొమాన్స్ మాములుగా ఉండదంట!

by Jakkula Samataha |
పుష్ప2లో ఎప్పుడూ చూడని విధంగా శోభనం సీన్.. అల్లు అర్జున్, రష్మికల రొమాన్స్ మాములుగా ఉండదంట!
X

దిశ, సినిమా : ప్రస్తుతం అందరి కళ్లు పుష్ప సినిమాపైనే ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప ది రైజ్ కు సీక్వెల్‌గా పుష్ప ది రూల్ మూవీ వస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ఫ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఇక పుష్ప2 మూవీ కూడా ఇప్పటి నుంచే అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక ఇప్పటికీ ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, గ్లింప్స్ వీడియోస్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? పుష్ప2లో అల్లు అర్జున్, రష్మిక మధ్య వచ్చే శోభనం సీన్ హైలెట్‌గా ఉండబోతుందంట. మాములుగా పల్లెటూర్లలో ఎలా ఉంటుందో, అంతే నేచురల్‌గా వీరి ఫస్ట్ నైట్ సీన్ ఉంటుంది అంటున్నారు. ఇక ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైనట్లు సమాచారం. ఇక ఈ మూవీ ఆగస్టులో విడుదల చేయనున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed