ఆ నిర్మాత నాతో ఓ రాత్రి గడపాలని అడిగాడు.. నటికి చేదు అనుభవం

by GSrikanth |   ( Updated:2022-06-28 14:57:39.0  )
ఆ నిర్మాత నాతో ఓ రాత్రి గడపాలని అడిగాడు.. నటికి చేదు అనుభవం
X

దిశ, సినిమా : టెలివిజన్ నటి శివా పఠానియా ఇటీవల ఓ చేదు అనుభవం ఎదురైనట్లు తెలిపింది. ఈ మేరకు ముంబైలోని శాంటాక్రూజ్‌లో ఆడిషన్‌కు వెళ్లానన్న ఆమె.. అక్కడ ఓ నిర్మాత తనతో ఒక రాత్రి గడపాలని కోరినట్లు తెలిపింది. 'నన్ను 31 ఏళ్ల వ్యక్తి ఆడిషన్ కోసం పిలిచాడు. అక్కడికి వెళ్లగానే ఓ గదిలో ఒక్కడే కూర్చుని తనే నిర్మాతనంటూ పరిచయం చేసుకున్నాడు. కాసేపు మాట్లాడి స్టార్ పక్కన యాడ్ చేయాలనుకుంటే తనకో హామీ ఇవ్వాల్సి ఉంటుందన్నాడు. అప్పటికే అర్థం చేసుకుని బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టాను. వెంటనే కోపం కూడా పెరిగిపోయింది. అతని ల్యాప్‌టాప్‌లో హనుమాన్ చాలీసా కూడా నడుస్తోంది. దీంతో 'నీకు సిగ్గు లేదా? ఒకవైపు దేవుని భజనలు వింటూనే నాతో ఏం మాట్లాడుతున్నావ్?' అని కడిగిపారేశానంది. అంతటితో ఆగకుండా ఆ మాయగాడిది ఫేక్ ప్రొడక్షన్ హౌస్ అని ప్రచారం చేసినట్లు వెల్లడించిన శివా పఠానియా.. జీవితంలో ఎదిగేందుకు కష్టపడి పనిచేస్తున్నప్పుడు, ఎవరిముందు తలొగ్గాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.


భర్తను ముద్దులతో నింపేసిన ప్రియాంక చోప్రా బికినీలోనే అలా చేస్తూ.


దీపిక సెక్స్ సినిమాలు చేసినా నో ప్రాబ్లమ్.. నేను అలా కనిపిస్తేనే .

Advertisement

Next Story