బాలీవుడ్‌ అందరికీ అవకాశాలివ్వదు.. షెహనాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Anjali |   ( Updated:2023-05-17 12:32:30.0  )
బాలీవుడ్‌ అందరికీ అవకాశాలివ్వదు.. షెహనాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవడంపై షెహనాజ్ గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. సినిమా పరిశ్రమ అందరికీ అందుబాటులో లేదని చెప్పింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం మరింత మార్చుకుంటూ పరిశ్రమను ఆకర్షించాలని సూచించింది. ‘హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఓపెన్ ప్లేస్ కాదు. మనమే దాని తలుపుతట్టాలి. దానికోసం ముందుగా మనం మారాలి. నా విషయంలోనూ ఇలాగే జరిగింది. నేను ఇప్పటివరకూ సాధించినదంతా కఠినమైన కృషి వల్లనే అని నిజాయితిగా చెప్పగలను’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.

Also Read..

గులాబీ రంగు గౌనులో మైమరపించిన ఊర్వశి.. విశ్వానికే అందగత్తెవంటున్న ఫ్యాన్స్

Advertisement

Next Story