ఆ విషయంలో దేవుడ్ని ఎప్పటికీ నిందిస్తూనే ఉంటా: సింగర్ సునీత

by Anjali |   ( Updated:2023-06-06 06:29:50.0  )
ఆ విషయంలో దేవుడ్ని ఎప్పటికీ నిందిస్తూనే ఉంటా: సింగర్ సునీత
X

దిశ, వెబ్‌డెస్క్: సింగర్ సునీతకు టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా.. ప్రముఖ సింగర్ ఎస్పీ బాలుపై ఆమె పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఎస్పీ బాలు పుట్టినరోజు సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఆయనతో కలిసి దిగిన ఫోటోను సునీత షేర్ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో ‘‘నిన్నటి నిజం ఈరోజు జ్ఞాపకం అంటే ఎలా?’’ అని పేర్కొన్నారు. బర్త్ డే విషేష్ నేరుగా చెప్పే లక్ లేకుండా చేసిన ఆ భగవంతుడిని ఎప్పటికీ నిందిస్తూనే ఉంటానని ఆమె తెలిపారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు దాదాపుగా 10,000 లైక్స్ వచ్చాయి. ఎస్పీ బాలు భౌతికంగా మరణించినా ఆయన పాటల రూపంలో ఎప్పటికీ జీవించి ఉంటారని నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

జనాల ఫీలింగ్స్‌‌తో నాకు పనిలేదు.. విలువలు మాత్రం పాటిస్తా

Advertisement

Next Story

Most Viewed