ఆమె నన్ను రాత్రి 11 గంటలకు రమ్మంది.. క్యాస్టింగ్ కౌచ్‌పై బిగ్ బాస్ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్

by Hamsa |
ఆమె నన్ను రాత్రి 11 గంటలకు రమ్మంది.. క్యాస్టింగ్ కౌచ్‌పై బిగ్ బాస్ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల చాలా మంది సెలబ్రెటీలు క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్లు సైతం తమ జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరించారు. తాజాగా, యాక్టర్ శివ ఠాక్రే క్యాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. శివ ఠాక్రే 2017లో MTV రోడీస్ రైజింగ్ అనే రియాలిటీ షోతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హిందీ బిగ్ బాస్ 16 షోలో రన్నరప్‌గా నిలిచి ప్రేక్షకుల్లో ఫుల్ పాపులారీటీని దక్కించుకున్నాడు. ఈ యంగ్ యాక్టర్‌కి ప్రస్తుతం సినిమా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్య్వూలో క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించాడు. ‘‘ముంబైకి వచ్చిన కొత్తలో నేనొక విషయం తెలుసుకున్నాను. క్యాస్టింగ్ కౌచ్ కేవలం అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఉంటుందనే దానికి నా జీవితమే ఉదాహరణ. “ఓ మహిళ నన్ను అర్ధ రాత్రి నన్ను 11 గంటలకు ఆడిషన్‌కి రమ్మని పిలిచింది. తనకు నాలుగు బంగ్లాలు ఉన్నాయంటూ.. పెద్ద పెద్ద వాళ్ళను స్టార్లను చేశానని తన గురించి గొప్పలు చెప్పుకుంది. అయితే 11 గంటల సమయంలో ఆడిషన్ అనేసరికి.. నేను అర్ధం చేసుకోలేనంత అమాయకుడిని కాదు. వేరే పని ఉందని రానని చెప్పేశాను. దీంతో ఆమె నువ్వు రాకపోతే ఇండస్ట్రీలో నువ్వు ఎలా ఉంటావో చూస్తాను అని బెదిరించింది. అయినా సరే ఆమె మాటలు లెక్కచేయకుండా అక్కడనుంచి వెళ్లిపోయాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story