తెలుగమ్మాయి హాలీవుడ్ మ్యాగజైన్ పైన.. వామ్మో ఇలా మారిపోయిందేంటీ..?

by Prasanna |
తెలుగమ్మాయి హాలీవుడ్ మ్యాగజైన్ పైన.. వామ్మో ఇలా మారిపోయిందేంటీ..?
X

దిశ, సినిమా: చైల్డ్ ఆర్టిస్టులుగా సినీ కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోయిన్లుగా వెలిగిపోతున్న వారు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. చాలా సినిమాల్లో క్యూట్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న వీరు ఇప్పుడు స్టార్ యాక్టర్స్‌గా స్థిరపడ్డారు. కావ్య కళ్యాణ్ రామ్, శ్రీవిద్య, తేజ సజ్జా వంటి తారలందరూ బాలనటులుగా కనిపించారు. అయితే ఇప్పుడు ఓ తెలుగు అమ్మాయి హాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. చిన్న వయసులోనే నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మాయి ఇప్పుడు హాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తోంది. అంతేకాకుండా, ఆమె ఒక ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్‌లో కనిపించి అందర్ని ఆశ్చర్యపరిచింది.

ఈ ముద్దుగుమ్మ పలు తెలుగు సినిమాల్లో, ప్రకటనల్లో నటించి అలరించింది. ఇప్పుడు హీరోయిన్‌గా మారనుంది.ఆమె అవంతిక వందనపు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవంలో బాలనటిగా కనిపించింది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించింది.

ఇదిలా ఉండగా, తాజాగా అవంతిక హాలీవుడ్ మ్యాగజైన్ గలోరీ కవర్ పేజీకి ఫోజులిచ్చింది. ఈ మ్యాగజైన్‌లో హాలీవుడ్‌లో మెరిసిన బ్లాక్ బ్యూటీలు ఉన్నారు. గలోరీ మ్యాగజైన్ కవర్ పేజీపై అవంతిక గ్లామరస్ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. జుట్టు రంగు మార్చుకుని హాలీవుడ్ అమ్మాయిలా కనిపిస్తున్న అవంతికను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed