షారుఖ్ నెక్స్ట్ సినిమా.. కమల్ హాసన్, అమితాబ్ మూవీస్‌ నుంచే వచ్చిందా..

by Anjali |   ( Updated:2023-04-30 12:45:09.0  )
షారుఖ్ నెక్స్ట్ సినిమా.. కమల్ హాసన్, అమితాబ్ మూవీస్‌ నుంచే వచ్చిందా..
X

దిశ, సినిమా: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నెక్స్ట్ ఫిల్మ్ ‘జవాన్’ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా దర్శకులు అట్లీ లోకనాయకుడు కమల్ హాసన్‌కు వీరాభిమాని. కాగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘ఒరు ఖైదియన్ డైరీ’ ఇన్‌స్పిరేషన్‌తోనే ‘జవాన్’ స్టోరీ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రివేంజ్ స్టోరీలో కమల్ తండ్రి, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా.. ఇందులో నుంచే కోర్ ప్లాట్ తీసుకున్న అట్లీ.. ప్రజెంట్ ఆడియన్స్‌ కనెక్ట్ అయ్యేలా మోడ్రన్‌గా రాసుకున్నాడని టాక్. ఎమోషన్స్‌తో కూడిన ఈ చిత్రం మాదిరిగానే ‘జవాన్’ కూడా ఉంటుందని.. ఇందులోనూ షారుఖ్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని సమాచారం. కాగా ‘ఒరు ఖైదియన్ డైరీ’ సినిమాను హిందీలో ‘ఆఖ్‌రీ రాస్తా’ పేరుతో అమితాబ్ బచ్చన్ రీమేక్ చేయడం విశేషం.

ఇవి కూడా చదవండి:

PS2 : 100 కోట్ల క్లబ్‌లో ‘పొన్నియిన్ సెల్వన్ 2’

Advertisement

Next Story