Alia Bhatt : అలియా భట్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న మరో టాలీవుడ్ హీరో

by Anjali |   ( Updated:2023-09-27 08:54:22.0  )
Alia Bhatt : అలియా భట్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న మరో టాలీవుడ్ హీరో
X

దిశ, సినిమా: ‘అందాల రాక్షసి’ మూవీలో హీరోగా నటించిన రాహుల్ ప్రజంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిలైపోయాడు. వచ్చిన ప్రతి ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు రాహుల్. అలియ భట్ నటిస్తున్న రీసెంట్ మూవీ ‘జిగ్రా’లో రాహుల్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ఆయన వైఫ్ చిన్మయి స్వయంగా తెలిపింది. ఇక ఈ మూవీలో అతని పాత్ర గురించిన వివరాలు తెలియాల్సివుంది. ఇదిలావుంటే.. ‘జిగ్రా’కు సంబంధించిన టైటిల్ ప్రోమో మంగళవారం విడుదల చేయగా అందులో.. ‘నన్ను చూడు. నువ్వు రాఖీ క‌ట్టావు క‌దా. మీరు నా రక్షణలో ఉన్నారు. నేను మీకు ఏమీ జరగనివ్వను’ అని అలియా భట్ చెప్పడం చూడొచ్చు. దీనినిబట్టి చూస్తే ఈ సినిమాలో రాహుల్.. అలియాకు అన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story