‘శరత్ బాబు సిగరేట్ కాల్చొద్దు అనేవారు’

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-23 06:26:50.0  )
‘శరత్ బాబు సిగరేట్ కాల్చొద్దు అనేవారు’
X

దిశ, వెబ్‌డెస్క్: శరత్ బాబు మృతి పట్ల రజనీకాంత్ సంతాపం తెలిపారు. ఈ రోజు తాను ఓ సన్నిహితుడు, అద్భుతమైన వ్యక్తిని కోల్పోయానన్నారు. ఇది కొలుకోలేని నష్టం, శరత్ బాబు ఆత్మకు శాంతి కలుగుగాక అన్నారు. తాను సిగరేట్ కాల్చే సందర్భంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని శరత్ బాబు కోప్పడేవారని రజనీకాంత్ తెలిపారు. నటుడు కాకముందే శరత్ బాబుతో పరిచయం ఉందన్నారు. ముత్తూ, అన్నామలై సినిమాలతో పాటు చాలా సినిమాల్లో కలిసి పనిచేశామన్నారు. మంచి మిత్రుడిని కోల్పోయానన్నారు. అనారోగ్యం కారణంగా శరత్ బాబు సోమవారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. నేడు చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు చేయనున్నారు.

Read More: శరత్ బాబు మృతికి అసలు కారణం అదే.. వెలుగులోకి సంచలన నిజాలు

నేడు చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు

Advertisement

Next Story