Sankarabharanam (శంకరాభరణం) చిత్రం 53వ ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ఇండియన్‌ క్లాసికల్‌ విభాగంలో ఎంపిక

by Nagaya |   ( Updated:2022-11-21 10:59:44.0  )
Sankarabharanam (శంకరాభరణం) చిత్రం 53వ ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ఇండియన్‌ క్లాసికల్‌ విభాగంలో ఎంపిక
X

దిశ, డైనమిక్ బ్యూరో : శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరుగుతున్న ఫిల్మ్‌ ఫెస్టివల్‌ క్లాసిక్స్‌ విభాగంలో Sankarabharanam (శంకరాభరణం) చిత్రం ప్రదర్శన చేశారు. 53వ ఐఎఫ్‌ఎఫ్‌ఐ(అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాలు)లో రిస్టోర్డ్ ఇండియన్‌ క్లాసికల్‌ విభాగంలో శంకరాభరణం మూవీ ఎంపిక అయింది. నేషనల్ ఫిల్మ్ అర్చివ్స్ ఆఫ్ ఇండియా వారు మనదేశంలోని గొప్ప చిత్రాలను డిజిటలైజ్ చేసి ప్రదర్శించనున్నారు. ఈ విభాగంలో శంకరాభరణం చిత్రం చోటుదక్కించుకుంది. కాగా 'శంకరాభరణం' వంటి ఆల్ టైమ్ క్లాసికల్ ఫిల్మ్ తీసిన దర్శకుడు కె. విశ్వనాథ్ తెలుగు వారి ఖ్యాతిని పెంచిన ఈ చిత్రాన్ని పనాజీలో జరుగుతున్న ఇఫి-2022 వేడుకల్లో ప్రదర్శించనున్నారు. ఈ సినిమాకు ఏడిద నాగేశ్వరరావు నిర్మాతగా పనిచేయగా, పూర్ణోదయ ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది.

Advertisement

Next Story

Most Viewed