‘శంకర్ దాదా MBBS’ రీ రిలీజ్.. నిమిషాల్లో అమ్ముడుపోయిన టికెట్స్!

by Nagaya |   ( Updated:2023-10-30 12:30:52.0  )
‘శంకర్ దాదా MBBS’ రీ రిలీజ్.. నిమిషాల్లో అమ్ముడుపోయిన టికెట్స్!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మనకు ఇష్టమైన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ‘శంకర్ దాదా MBBS’ ఒకటి. హిందీలో సంజయ్ దత్ హీరో‌గా నటించిన ‘మున్నా భాయ్ ఎంబీబీఎస్’ చిత్రానికి ఇది రీమేక్. కానీ ఒరిజినల్ వెర్షన్ కంటే ఈ రీమేక్ వెర్షన్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే మెగాస్టార్ కామెడీ టైమింగ్‌కు ఆడియన్స్ మొత్తం ఫుల్ ఫిదా అయిపోయారు. ఇక తాజాగా ఈ సినిమాను మేకర్స్ లేటెస్ట్ 4Kలోకి మార్చి గ్రాండ్‌గా నవంబర్ 4న రీ రిలీజ్ చెయ్యబోతున్నారు. దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పలు ప్రాంతాలలో మొదలు కాగా హైదరాబాద్‌లో మాత్రం హాట్ కేక్‌ల్లా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. బుక్ మై షో లెక్కల ప్రకారం ఈ సినిమాకు కేవలం ఒక్క గంటలో 5 వేల టికెట్స్ సేల్ అయ్యాయి. అది కూడా కేవలం 5 షోస్ మీద మాత్రమే. ఇక రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైతే ఏ రేంజ్‌లో ఉంటాయో అంటూ ఫ్యాన్స్ ఖష్ అవుతున్నారు.

Advertisement

Next Story