రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ‘శక్తిమాన్’ మూవీ

by sudharani |   ( Updated:2023-06-06 10:08:14.0  )
రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ‘శక్తిమాన్’ మూవీ
X

దిశ, సినిమా: టెలివిజన్‌లో ప్రసారమైన ‘శక్తిమాన్’ సీరియల్‌ని ఎవరూ మర్చిపోలేరు. 1997 నుంచి 2005 వరకు టెలికాస్ట్ అయిన ఈ సీరియల్‌లో ముఖేశ్‌ ఖన్నా శక్తిమాన్‌గా నటించాడు. కాగా ఈ సీరియల్‌ను సినిమాగా మూడు భాగాలో తెరకెక్కించబోతునట్లు సమాచారం. బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని టాక్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ముఖేష్ కన్నా ‘శక్తిమాన్’ సినిమా కోసం ఒప్పందం కుదిరింది. దీని 200-300 కోట్ల బడ్జెట్‌తో ‘స్పైడర్ మ్యాన్’ చిత్రాన్ని రూపొందించిన సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఎప్పుడో రావాల్సిన మూవీ కానీ మధ్యలో కరోనా వచ్చింది. ఇక ఇప్పుడు మూవి పనులు జరుగుతున్నాయి. ఇందులో నేను కూడా కనిపిస్తాను కానీ, ఎలా కనిపించనున్న అనేది క్లారిటీగా చెప్పలేను. పెద్ద సినిమా కాబట్టి సమయం పడుతుంది’ అని చెప్పుకొచ్చాడు.

Also Read... Heroine: సింగిల్ నైట్లో క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ను గుర్తు పట్టగలరా?

Advertisement

Next Story