బాద్‌షా 'జవాన్' మూవీ.. నాన్ థియేట్రికల్ బిజినెస్ రూ. 250 కోట్లు

by sudharani |   ( Updated:2022-09-25 12:57:47.0  )
బాద్‌షా జవాన్ మూవీ.. నాన్ థియేట్రికల్ బిజినెస్ రూ. 250 కోట్లు
X

దిశ, సినిమా : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అప్‌కమింగ్ మూవీ 'జవాన్'. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తికాకుండానే శాటిలైట్ కోసం 'జీ5', ఆఫ్టర్ థియేటర్ ఓటీటీ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ సంస్థ సంయుక్తంగా రూ. 250 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సిన అవసరముండగా.. అసలు ఒక కమర్షియల్ మూవీకి, అందులోనూ సగం ముఖం కప్పేసిన పోస్టర్ తప్ప కనీసం టీజర్ కూడా బయటకురాని సినిమాకు ఇంత రేటు పలకడం ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఈ భారీ డీల్‌ చూస్తుంటే.. అట్లీ-షారుఖ్ కాంబినేషన్ పట్ల ట్రేడ్ వర్గాలకున్న నమ్మకమేంటో అర్థమవుతోంది. ఇక తెలుగు సహా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానున్న 'జవాన్' 2023 జూన్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read : 8 ప్యాక్ ఫోటో తో రచ్చ చేస్తున్న'Shah Rukh Khan'

Advertisement

Next Story