Alia Bhatt : అలియపై షారుఖ్ కూతురు వైరల్ కామెంట్స్..

by sudharani |   ( Updated:2023-11-29 12:46:24.0  )
Alia Bhatt : అలియపై షారుఖ్ కూతురు వైరల్ కామెంట్స్..
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ‘ది ఆర్చీస్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. టీనేజ్ మ్యూజికల్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 7న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా సుహాన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతుంది. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అలియా భట్ గురించి మాట్లాడుతూ వైరల్ కామెంట్స్ చేసింది.

‘అలియ ఇటీవల నేషనల్ అవార్డు అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ నేషనల్ అవార్డు అందుకునే సమయంలో ఆమె తన పెళ్లి చీర ధరించింది. ఈ విషయంపై చాలా మంది పోస్టులు పెట్టారు. సెలబ్రిటీలు ఒకసారి ధరించిన దుస్తులను మళ్లీ రిపీట్ చేయకపోవడమే ఇందుకు కారణం. కానీ ఈ పద్ధతిని అలియా భట్ బ్రేక్ చేశారు. ఇక్కడ చాలా మంది సెలబ్రిటీస్‌ వన్ టైం యూజ్ పద్ధతిని ఫాలో అవుతున్నవారే ఎక్కువ. దీన్ని బ్రేక్ చేయడానికి ఆమె మొదటి అడుగు వేశారు. ఇలా అలియా భట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సెలబ్రిటీలందరికీ ఒక మంచి సందేశం’ అని సుహాన తెలిపింది.

Advertisement

Next Story