ప్రపంచంలోని అత్యంత ధనిక నటుల లిస్టులో షారుఖ్‌కు చోటు.. ఆయన ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-11-02 17:48:01.0  )
ప్రపంచంలోని అత్యంత ధనిక నటుల లిస్టులో షారుఖ్‌కు చోటు.. ఆయన ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
X

దిశ, సినిమా: ఇది షారుఖ్‌‌కు అదృష్ట సంవత్సరం అని చెప్పాలి. ఎందుకంటే ఈ సంవత్సరం పఠాన్, జవాన్‌లతో రెండు బ్లాక్ బస్టర్ హిట్‌లు అందుకున్నాడు. ఈ రెండు చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల కలెక్షన్ క్లబ్‌లో చేరాయి. దీంతో బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను అందించిన షారుఖ్ ఖాన్ రెంజ్ మరింత పెరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం షారుఖ్ ఖాన్ ప్రపంచంలోని అత్యంత సంపన్న నటుల్లో 5వ స్థానంలో నిలిచాడు.

ఈ మేరకు టామ్ క్రూజ్, జాకీ చాన్‌లను అధిగమించి ప్రపంచంలోని నాల్గవ అత్యంత ధనవంతుడిగా షారుఖ్ ఖాన్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అంటే షారుఖ్ ఖాన్ మొత్తం ఆస్తున్న విలువ రూ.700 మిలియన్ డాలర్లు. అంటే రూ.6289 కోట్లకు మించి ఉంటుందట. ఒక్కో సినిమాకు రూ.100 కోట్లు పారితోషికం తీసుకునే షారుఖ్‌కు సినిమాలే కాకుండా ఎన్నో ఆదాయ వనరులున్నాయట. IPL జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ యజమానిగా జూహీ చావ్లాతో భాగస్వామిగానూ ఉన్నాడు. వీటితో పాటు చాలా ప్రకటనల్లో కనిపిస్తున్న షారుఖ్ కోట్లలో పారితోషికం తీసుకుంటాడట.

Advertisement

Next Story