కూతురితో సినిమా చేయబోతున్న షారుఖ్.. 6నెలలు అక్కడే ఉంటారట!

by Hamsa |   ( Updated:2023-10-19 07:22:12.0  )
కూతురితో సినిమా చేయబోతున్న షారుఖ్.. 6నెలలు అక్కడే ఉంటారట!
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తన కూతురు సుహానా ఖాన్‌‌తో‌ కలిసి ఓ యాక్షన్ థ్రిల్లర్‌లో నటించబోతున్నట్లు ఇటీవల న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్ గురించి తాజాగా మరో ఆసక్తికరమైన అప్ డేట్ బయటకొచ్చింది. ఈ మేరకు ప్రముఖ డైరెక్టర్ సుజోయ్ ఘోష్ ఈ మూవీని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుండగా ఇటీవలే స్క్రిప్ట్ దాదాపు ఫైనల్ అయిందని, నవంబరులోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. అంతేకాదు రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌లో నిర్మించబోతుందని, యాక్షన్ సన్నివేశాలను దాదాపు 6నెలలపాటు విదేశాల్లోనే చిత్రీకరించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story