60 ఏళ్ల అభిమాని కోరిక తీర్చిన షారుఖ్.. నెటిజన్లు ఫిదా

by Prasanna |
60 ఏళ్ల అభిమాని కోరిక తీర్చిన షారుఖ్.. నెటిజన్లు ఫిదా
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తాజాగా ఓ 60 ఏళ్ల అభిమాని చివరి కోరిక తీర్చాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన శివాని చక్రవర్తి టెర్మినల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కాగా శివానికి షారుక్‌ను చూడాలని కోరిక. దీంతో శివాని కూతురు తన తల్లి కోరిక తీర్చాలంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియే వైరల్ కావడంతో వెంటనే స్పందించిన షారుఖ్.. వీడియో కాల్ ద్వారా శివానితో మాట్లాడారు. ‘జాయ్ పట్టణానికి వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. నా వంతు ఆర్థిక సాయం అందిస్తాను. మీ కుమార్తె పెళ్లికి కూడా వస్తాను. నేను వచ్చినప్పుడు ముళ్లు లేని చేపల కూర వండి పెట్టండి’ అని షారుఖ్ శివానికి చెప్పాడు. షారుఖ్ అలా మాట్లాడడంతో శివాని ఆనందం పట్టలేకపోయింది.

Advertisement

Next Story