డచ్ సింగర్‌పై ప్రశంసలు కురిపించిన షారూఖ్.. ఎందుకంటే?

by Shiva |   ( Updated:2023-10-04 13:06:53.0  )
డచ్ సింగర్‌పై ప్రశంసలు కురిపించిన షారూఖ్.. ఎందుకంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : షారుఖ్‌ ఖాన్‌ నటించిన 'జవాన్‌' మూవీ చాలా మంది హృదయాలను గెలుచుకుంది. అత్యధిక కలెక్షన్లతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్‌గా నిలిచి మూవీ మేకర్స్‌కు కనకవర్షాన్ని కురిపిస్తోంది. మూవీ స్టోరీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో, అందులోని పాటలు కూడా యువతను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ క్రమంలో డచ్ పాపులర్ సింగర్ ఎమ్మా హీస్టర్స్ జవాన్ మూవీలోని 'చలేయా' పాటను పాడగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా.. షారుఖ్ ఖాన్‌ 'అవును, ఆమె చాలా బాగా పాడుతోంది, ధన్యవాదాలు !!! #చాలేయా' అని కామెంట్ చేశాడు.

Advertisement

Next Story