గర్ల్‌ఫ్రెండ్‌తో ‘జవాన్’ చూసేందుకు ఫ్రీ టికెట్ అడిగిన నెటిజన్.. షారుఖ్ ఖాన్ రియాక్షన్ ఇదే

by Hamsa |
గర్ల్‌ఫ్రెండ్‌తో ‘జవాన్’ చూసేందుకు ఫ్రీ టికెట్ అడిగిన నెటిజన్.. షారుఖ్ ఖాన్ రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, నయనతార కలిసి నటిస్తున్న సినిమా ‘జవాన్’. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 7న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో షారుఖ్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించారు.

ఇందులో భాగంగా ఓ అభిమాని ఆసక్తికరమైన ప్రశ్న వేశాడు. మీరు నా గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ టికెట్ ఇప్పించగలరా? అని ట్వీట్ చేశాడు. అయితే దీనికి షారుఖ్ స్పందిస్తూ.. ‘‘ ఉచితంగా ప్రేమ మాత్రమే దొరుకుతుంది. టికెట్ కాదు. టికెట్ కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిందే. ప్రేమ విషయంలో మరీ ఇంత చీప్‌గా ఉండకండి. వెళ్లి టికెట్ కొనుక్కోండి. మీ ప్రియురాలిని సినిమాకు తీసుకెళ్లండి’’ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

Advertisement

Next Story