Shah Rukh Khan ‘Jawan’ ట్విట్టర్ రివ్యూ

by GSrikanth |   ( Updated:2023-09-07 15:49:41.0  )
Shah Rukh Khan ‘Jawan’ ట్విట్టర్ రివ్యూ
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం ఇవాళ(07-09-2023) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. తమిళ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సౌత్ క్వీన్ నయనతార హీరోయిన్‌గా నటించింది. మరో కీలక పాత్రలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించారు. కాగా, గురువారం పొద్దున్నే విదేశాల్లో ప్రీమియర్‌లు చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా చిత్రంపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోసారి యంగ్ డైరెక్టర్ అట్లీ తన మార్క్ సినిమా తీశారని ప్రశంసిస్తున్నారు.

కింగ్ ఖాన్ ఖాతాలో మరో హిట్ పడిందని కామెంట్ల వర్షం కుపిస్తున్నారు. ఈ సినిమా విషయానికి వస్తే 1st ఆఫ్ అదిరిపోగా.. సెకండ్ ఆఫ్‌లో ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తప్పదంటూ అభిమానులు థియేటర్ల వద్ద రచ్చ చేస్తున్నారు. సినిమాలో హీరో ఫ్లాష్ బ్యాక్, హీరోయిన్ నయనతారా ఎంట్రీ సీన్, విజయ్ సేతుపతి యాక్టింగ్, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పిచ్చెక్కిస్తాయని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story