- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెంకటేష్ సినిమాలో స్టార్ డైరెక్టర్ కీలకపాత్ర?
దిశ, సినిమా: టాలీవుడ్‌లో మోస్ట్ సీనియర్ దర్శకుల్లో రాఘవేంద్రరావు ఒకరు. దాదాపు వందకుపైగా సినిమాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావుకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది నటీనటులను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కింది. సినిమాలు తీయడంలోనూ ఆయన స్టైల్ వేరే. దీంతోపాటు భక్తి చిత్రాలు తీయడంలోనూ ఆయన దిట్ట. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ వంటి సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు. చివరగా శ్రీకాంత్ కొడుకు రోషన్‌తో ‘పెళ్లి సందD’ సినిమా తెరకెక్కించాడు. అయితే తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ హీరోగా దర్శకుడు అనుదీప్ తెరకెక్కిస్తున్న సినిమాలో ఒక కీలక పాత్రలో రాఘవేంద్రరావు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే రాఘవేంద్రరావు కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో నటుడిగా అదరగొట్టబోతున్నట్లే. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ఆయన అభిమానులు ఖుష్ అవుతున్నారు.