- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోజా కూతురి ఫొటోలు మార్ఫింగ్.. కన్నీరు పెట్టుకున్న నటి
దిశ, సినిమా : ప్రముఖ సీనియర్ నటి రోజా తన ఫ్యామిలీ గురించి వస్తున్న ట్రోలింగ్‌పై స్పందిస్తూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి హోదాలో బిజీగా ఉంటున్న ఆమె..ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నా కూతురు అన్షుమాలిక చాలా సెన్సిటివ్. అయినప్పటికీ తనను దారుణంగా ట్రోల్ చేశారు. సోషల్ మీడియాలో తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. అవన్నీ చూసి నా కూతురు ఒత్తిడికి లోనైంది. బాధపడుతూ ఏడ్చింది. 'ఇలాంటివన్నీ మనకు అవసరమా? అన్నింటిని వదిలేసి ప్రశాంతంగా ఉందాం' అంటూ నాతో గొడవపడింది. అయితే సెలబ్రిటీల జీవితాల్లో ఇలాంటివి సర్వసాధారణమని నా పిల్లలకు అర్థమయ్యేలా వివరించాను' అంటూ చెప్పుకొచ్చింది రోజా. చివరగా తన కుటుంబాన్ని టార్గెట్ చేసి నెగెటీవ్ కామెంట్స్ చేయడం ఆపాలని కోరగా ప్రస్తుతం ఈ న్యూస్ చర్చనీయాంశమైంది.