ఎన్టీఆర్‌ డ్యాన్స్‌పై రంభ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by sudharani |
ఎన్టీఆర్‌ డ్యాన్స్‌పై రంభ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: సీనియర్ హీరోయిన్ రంభ గురించి పరిచయం అక్కర్లేదు. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రజంట్ మూవీస్‌‌కు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రంభ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.

రంభ మాట్లాడుతూ.. ‘ఈ తరం హీరోయిన్లలో నాకు త్రిష అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలామంది హీరోయిన్లు తెలిసినా కూడా చూసి చూడనట్టుగా ప్రవర్తిస్తారు. కానీ త్రిషతో రెండు మూడు సార్లు కలిసినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకుంది. హీరోల్లో నాకు చాన్స్ వస్తే మహేష్, ప్రభాస్‌‌తో నటిస్తా. తారక్‌తో జర్ని నాకు నచ్చింది. ‘యమదొంగ’ మూవీలో ‘నాచోరే నాచోరే’ సాంగ్ చేశాను. ఎన్టీఆర్ డ్యాన్స్ అద్భుతంగా చేశారు. కన్ను ఆర్పకుండా చూస్తూ ఉండిపోయా. ఎన్టీఆర్ ఈజ్ ది బెస్ట్ డాన్సర్’ అని చెప్పుకొచ్చింది రంభ.

Advertisement

Next Story