‘#NTR30’.. జాన్వీకపూర్ తల్లిగా మణి చందన..?

by Vinod kumar |
‘#NTR30’.. జాన్వీకపూర్ తల్లిగా మణి చందన..?
X

దిశ, సినిమా: ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న మూవీ ‘#NTR 30’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. మూవీలో జాన్వీకి తల్లిగా సీనియర్ నటి మణి చందన నటించనుందట. ‘మనసిచ్చాను’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మణి చందన.. పెళ్లి అనంతరం సినిమా రంగానికి దూరమైంది. మళ్లీ ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే తారక్ మూవీలో అవకాశం దక్కించుకుందట.

Advertisement

Next Story