నీకు ఎవరు దొరకరు రా ఇద్దరం పెళ్లి చేసుకుందాం.. సీనియర్ నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్!

by Jakkula Samataha |
నీకు ఎవరు దొరకరు రా ఇద్దరం పెళ్లి చేసుకుందాం..  సీనియర్ నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా : సీనియర్ హీరోయిన్ ఇంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పా్లసిన పని లేదు. హాలో బ్రదర్ సినిమాలోని కన్నెపిట్టరో సాంగ్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. మరీ ముఖ్యంగా ఈ నటి చేసిన యమలీల సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఇంద్రజ తెలుగులో చాలా సినిమాల్లోనే నటించి మెప్పించింది. ఫెయిల్యూర్స్ పట్టించుకోకుండా వరసగా సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది.

అయితే చాలా రోజులు వెండితెరకు దూరంగా ఉన్న ఈ నటి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా బుల్లితెరపై కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోలు చేస్తూ చాలా బిజీగా మారిపోయింది. ఇక ఇటీవల ఎక్స్ ట్రా జబర్దస్త్ షోను రద్ధు చేయడం, ఇంద్రజను తొలిగించడం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నటికి సంబంధించిన అనేక వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈమె ప్రేమ పెళ్లికి సంబంధించిన వార్త చక్కెర్లు కొడుతోంది. ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఇంద్రజ తన ప్రేమ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. నటుడు, రైటర్‌ మహ్మద్‌ అబ్సర్‌‌ను ఇంద్రజ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అతను తనకు కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం కావడం ఇద్దరి మధ్య స్నేహం కూడా పెరిగిపోయిదంట. దీంతో ఇద్దరి ఫ్యామీలీస్ గురించి ఇద్దరికీ తెలియడం, ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకోవడంతో వీరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో నీకు ఎవరు దొరకరు, నాకూ ఎవరు దొరకరు రా ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందామన్నాడంట. అలా ఇద్దరం పెళ్లి చేసుకున్నామని, చాలా విచిత్రంగా తాము ఒక్కటయ్యామని తెలిపింది ఇంద్రజ. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed