పెళ్లికి ముందు శృంగారంలో తప్పులేదంటూ.. బెడ్‌పై ప్రియుడితో దర్శనమిచ్చిన తమన్న

by Anjali |   ( Updated:2023-06-09 05:43:14.0  )
పెళ్లికి ముందు శృంగారంలో తప్పులేదంటూ.. బెడ్‌పై ప్రియుడితో దర్శనమిచ్చిన తమన్న
X

దిశ, సినిమా: OTTలో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్’ సిరీస్ ఎంత పాపులారిటి దక్కించుకుందో చెప్పక్కర్లేదు. ఇందులో కియారా అద్వానీ, భూమీ పెడ్నేకర్, రాధికా ఆప్టే, మనీషా కొయిరాలా నటించిన శృంగార సన్నివేశాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విమర్శలు, వివాదాలతో పాటు ప్రశంసలు సైతం అందుకుంది. అయితే తాజాగా ఈ సిరీస్ పార్ట్ 2 కూడా రానుంది. ఇందులో తమన్నా భాటియా, మృణాల్ ఠాకూర్, కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌కు సంబంధించి తాజాగా టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో మొదటి భాగంలో ఉన్నట్లుగా అభ్యంతరకర సన్నివేశాలు లేవు కానీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాత్రం ఉన్నాయి. ఒక షాట్‌లో నటుడు విజయ్ వర్మతో తమన్న బెడ్‌పై ముద్దుల్లో మునిగితేలుతున్నట్లు చూపించారు. విజయ్ వర్మతో తమన్న రిలేషన్‌లో ఉందని వార్తలు వస్తున్న క్రమంలో.. ఇలా వారిద్దరూ కలిసి బెడ్‌పై కనిపించడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ పార్ట్ 2 జూన్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

Next Story