‘సేవ్ ద టైగర్స్ 2’ ట్రైలర్ రిలీజ్ .. దెబ్బకు సిస్టమ్ మారిపోవాలా..!

by Kavitha |   ( Updated:2024-03-02 07:51:15.0  )
‘సేవ్ ద టైగర్స్ 2’ ట్రైలర్ రిలీజ్ .. దెబ్బకు సిస్టమ్ మారిపోవాలా..!
X

దిశ, సినిమా: గతేడాది ఫ్యామిలీ ప్రేక్షకులందరిని కడుపుబ్బా నవ్వించిన కామెడీ వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ ఆరు ఎపిసోడ్స్‌గా వచ్చి మంచి విజయం సాధించింది. తేజ కాకుమాను దర్శకత్వంలో కమెడియన్ అభినవ్ గోమఠం, హీరో అండ్ యాక్టర్ చైతన్య కృష్ణ, ప్రియదర్శి, పావని, జోర్దార్ సుజాత, దేవయాని మూడు జంటలుగా కనిపించి వినోదం పంచారు. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘సేవ్ ద టైగర్స్ 2’ సీజన్ రానుంది. కాగా తాజాగా ఈ సీజన్2 కి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. మొదటి సీజన్ లానే రెండో సీజన్ కూడా చాలా నటించనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

మొదటి సీజన్ ఎక్కడితో ముగిసిందో అది గుర్తుచేస్తూ పోలీసుల ఇంట్రాగేషన్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం అయింది. అలా ఈ ట్రైలర్‌లో బ్యూటిఫుల్ హీరోయిన్ సీరత్ కపూర్ ఎంట్రీ ఇచ్చింది. ఆడోళ్ల డామినేషన్‌ను కంట్రోల్‌లో పెట్టేది ఏదైనా కనిపెట్టన్న అని ప్రియదర్శి అంటే.. దెబ్బకు సిస్టమ్ మారిపోవాలా అని చైతన్య అనడంతో ట్రైలర్ ముగుస్తుంది. ఇక మరోసారి కుటుంబ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు ఈ సీజన్ 2 డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది.

అంతే కాదు సీజన్ 2 రాబోతున్న నేపథ్యంలో ఫస్ట్ సీజన్‌ను చూడాని వారి కోసం. మార్చి 10 వరకు ఉచితంగా ఈ సిరీస్‌ని చూసే అవకాశం కల్పిస్తోంది ఓటీటీ సంస్థ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. ఈ ఆఫర్‌ను ఇటీవల ప్రకటించింది.

Read More..

ఉపాసన కాళ్లు పట్టుకుని మరీ సేవలు చేస్తున్న గ్లోబల్ స్టార్ (వీడియో).. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!


Advertisement

Next Story