సుమ షో లో వై.ఎస్ షర్మిలపై సెటైర్స్.. చివరకు వీళ్లు కూడా వదలడం లేదుగా (వీడియో)

by sudharani |   ( Updated:2023-12-16 17:10:46.0  )
సుమ షో లో వై.ఎస్ షర్మిలపై సెటైర్స్.. చివరకు వీళ్లు కూడా వదలడం లేదుగా (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలలో ‘సుమ అడ్డా’ ఒకటి. ఈ కార్యక్రమంలో సుమ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. సెలబ్రెటీలతో రచ్చ రచ్చ చేస్తుంది. ఈ క్రమంలొనే షో కి వచ్చిన సెలబ్రిటీలపై పంచులు వేస్తూ.. వారితో ఆడుకున్న తాజా ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో వైఎస్ షర్మిలను విమర్శించారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా రిలీజైన ప్రోమో ప్రకారం.. షో కు అదిరే అభి, సుజాత, విద్యుల్లేఖ, సుదర్శన్ వచ్చారు. ఇందులో ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటూ.. సుమ ఆడించిన ఆటలు ఆడుతూ ఫుల్ జోష్‌లో సాగింది. అయితే.. అదిరే అభి ‘విద్యార్థులను విద్యార్థులు అని ఎందుకంటారో తెలుసా’ అని కామెడీ చేశాడు. యాదృచ్చికంగా షర్మిల పలికిన మాటలను సమ షోలో కామెడీ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇక్కడ కూడా షర్మిల అక్కను వదలడం లేదుగా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Advertisement

Next Story