Saripoda Sanivaram: OTT రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘సరిపోదా శనివారం’ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

by Anjali |   ( Updated:2024-08-29 14:09:46.0  )
Saripoda Sanivaram: OTT రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘సరిపోదా శనివారం’ ..  స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ హీరోగా నేడు (ఆగస్టు 29) తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ చిత్రం నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీ ఫ్లాప్ కావడంతో నేచురల్ స్టార్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయకు చాన్స్ ఇచ్చిన హీరో నాని హిట్ కొట్టలేకపోయాడు. మూవీ ఫస్ట్ పార్ట్‌లో ఎస్ జే సూర్య డామినేట్ చేస్తాడు. సెకండ్ పార్ట్ లో నాని డామినేట్ చేస్తారు. ఇక ఇందులో హీరోయిన్ ప్రియాంక మోహన్ కానిస్టేబుల్ గా కనిపిస్తుంది. జాక్స్ బిజాయ్ సంగీతాన్ని సమకూర్చారు.

తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన సరిపోదా శనివారం ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందని ఓటీటీ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ క్రమంలో ఓటీటీ స్ట్రీమింగ్ పై తాజాగా బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీ సెప్టెంబరు 26 వ తేదీన స్ట్రీమింగ్ అవ్వనుందట. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవ్వనుందని నెట్టింట గట్టి టాక్ వినిపిస్తుంది. హిందీ వెర్షన్ మాత్రం మరో ఓటీటీ జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. దీనిపై త్వరలోనే త్వరలోనే అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారట.

Advertisement

Next Story