Palasa: బొలేరో, బైక్ ఢీ.. బయటపడ్డ 600 కేజీల గంజాయి

by srinivas |   ( Updated:2024-10-25 17:25:56.0  )
Palasa: బొలేరో, బైక్ ఢీ.. బయటపడ్డ 600 కేజీల గంజాయి
X

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదంలో గంజాయి(Ganja) సరఫరా గుట్టు రట్టు అయింది. ఒడిశా(Odisha) నుంచి ఏపీ (Ap) మీదుగా దుండగులు యదేచ్ఛగా గంజాయి తరలిస్తున్నారు. పోలీసుల కళ్లు కప్పి సరిహద్దులు దాటించి అక్రమంగా డబ్బులు సంపాదించుకుంటున్నాయి. అయితే జరిగిన రోడ్డు ప్రమాదం గంజాయి తరలింపును బయటపెట్టింది. ఒడిశా నుంచి మిలియాపుట్టి మీదుగా పలాస(Palasa)కు బొలేరో వాహనం వెళుతోంది. అయితే సవరజాడుపల్లి(Savarajadupalli) దగ్గర ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. దీంతో బొలేరో వాహనదారుడు పరారయ్యాడు. అయితే పోలీసులు వాహనాన్ని తనిఖీలు చేశారు. దీంతో బొలేరోలో సుమారు 600 కేజీల గంజాయిని గుర్తించారు. గంజాయి విలువ రూ. 60 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. బొలేరో వాహనంతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story