IndusInd Bank: కుప్పకూలిన ఇండస్‌ఇండ్ బ్యాంక్ స్టాక్స్.. ఒక్కరోజే 19 శాతం క్రాష్..!

by Maddikunta Saikiran |
IndusInd Bank: కుప్పకూలిన ఇండస్‌ఇండ్ బ్యాంక్ స్టాక్స్.. ఒక్కరోజే 19 శాతం క్రాష్..!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఇండస్‌ఇండ్ బ్యాంక్(IndusInd Bank) జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల(July-September Quarter Results)ను ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో ఆ సంస్థ మార్కెట్ అంచనాల్ని అందుకోలేకపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) రెండో త్రైమాసికం(Q2FY25)లో నికర లాభం 40 శాతం తగ్గి రూ.1,331 కోట్లకు పరిమితమైనట్లు ఇండస్‌ఇండ్ బ్యాంక్ తెలిపింది. కాగా గతేడాది ఇదే త్రైమాసిక ఫలితాల నాటికి నికర లాభం రూ. 22022 కోట్లుగా ఉందని తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో పేర్కొంది. కానీ సంస్థ కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ.13,530 కోట్ల నుంచి రూ.14,871 కోట్లకు చేరింది. ఇదిలా ఉంటే రెండో త్రైమాసికంలో ఆశించినంత మేర లాభాల రాకపోవడంతో ఇండస్ ఇండ్ బ్యాంక్ శుక్రవారం స్టాక్ మార్కెట్(Stock Market)లో భారీగా నష్టాలను చవిచూసింది. ఆ సంస్థ షేర్లు ఏకంగా 19 శాతం మేర పతనమయ్యాయి. దీంతో ఈ ఒక్క రోజే సంస్థ రూ.18,489.39 కోట్లు నష్టపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ బీఎస్ఈ(BSE)లో 19.82 శాతం నష్టంతో రూ.1,037లకు పడిపోయింది. ఇంట్రాడేలో ఆ సంస్థ షేర్ 19.88 శాతం వరకు నష్టపోయి రూ.1,025.50లతో 52 వారాల కనిష్టాన్ని తాకింది. దీంతో ఇండస్ఇండ్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.81,136.03 కోట్లతో సరిపెట్టుకుంది.

Advertisement

Next Story