శరత్ బాబు మొదటి భార్య టాప్ టాలీవుడ్ నటి అని మీకు తెలుసా?

by GSrikanth |   ( Updated:2023-08-29 05:44:24.0  )
శరత్ బాబు మొదటి భార్య టాప్ టాలీవుడ్ నటి అని మీకు తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు(71) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తుండగా.. శరత్ బాబు వ్యక్తిగత విషయాలపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శరత్ బాబుకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరికీ విడాకులు ఇచ్చారు. మొదటి భార్య రమా ప్రభ అనే విషయం అందరికీ తెలిసిందే.

Advertisement

Next Story