నెటిజన్ల మనసు గెలుచుకున్న సచిన్ కూతురు.. నెట్టింట ప్రశంసలు

by Anjali |   ( Updated:2023-04-27 10:25:00.0  )
నెటిజన్ల మనసు గెలుచుకున్న సచిన్ కూతురు.. నెట్టింట ప్రశంసలు
X

దిశ, సినిమా: సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌ గుడ్ బిహేవియర్‌తో మరోసారి అభిమానుల మనసు గెలుచుకుంది. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అలరించే స్టార్ కిడ్.. తాజాగా ఓ ఎయిర్‌పోర్ట్‌లో అభిమానుల సెల్ఫీ డిమాండ్‌లను సంతోషంగా అంగీకరించి గొప్ప మనసు చాటుకుంది. ఈ మేరకు తల్లి అంజలితో కలిసి గోవా విమానాశ్రంలో దర్శనమిచ్చిన సారాతో ఫొటోలకోసం కొంతమంది చుట్టుముట్టారు.

అయితే ఆమె ఎలాంటి చిరాకు పడకుండా అందరికీ ఫొటో దిగే అవకాశం ఇవ్వడం విశేషం. కాగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. తన క్యూట్‌నెస్, చిరునవ్వుపై లక్షలాది మంది అభిమానులను ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలావుంటే.. తన సోదరుడు అర్జున్ టెండూల్కర్, రూమర్ ప్రియుడు షుబ్‌మన్ గిల్ ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడుతున్న విషయం తెలిసిందే. కాగా వీరిద్దరితో సారాను లింక్ చేస్తూ ‘కిసీ కా భాయ్.. కిసీ కి జాన్’ అంటూ కొంతమంది ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తు్న్నారు.

Also Read.. సపోర్ట్ ఉంటే సరిపోదు.. మనలో సత్తా ఉండాలి: ‘నేపో బేబీ’ ట్యాగ్‌పై అలియా

Advertisement

Next Story