అతనే నా మొగుడు.. శుభ్‌మన్ గిల్‌తో డేటింగ్‌పై స్పందించిన Sara Ali Khan

by Anjali |   ( Updated:2023-06-08 08:23:54.0  )
అతనే నా మొగుడు.. శుభ్‌మన్ గిల్‌తో డేటింగ్‌పై స్పందించిన Sara Ali Khan
X

దిశ, సినిమా: ఇండియన్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ‘జర హట్ కే జర బచ్ కే’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి.. తన పెళ్లి, ప్రేమ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. ఈ మేరకు ‘మీకు కాబోయే వాడు ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ అమ్మ, నాన్నల లైఫ్ స్టైల్ ఫాలో అవుతారా?’ అని యాంకర్ ప్రశ్నించగా.. ‘నా ఆలోచనలను, ఆధ్యాత్మిక విలువలను గౌరవించే వ్యక్తి దొరికినప్పుడు ఎక్కువగా ఆలోచించకుండా పెళ్లిచేసుకుంటా. అయితే అతను ఏ రంగానికి చెందినవాడనేది పెద్దగా పట్టించుకోను. క్రికెటర్, యాక్టర్, బిజినెస్‌మెన్ ఎవరైనా నాకు ఓకే. నన్ను, నా పనిని ఇష్టపడాలి’ అని చెప్పింది. చివరగా ఇప్పటికీ తన లైఫ్ పార్ట్‌నర్‌ను కలవలేదన్న బ్యూటీ.. ఎక్కడ తారసపడినట్లు కూడా అనిపించలేదంటూ.. శుభమన్‌ గిల్‌తో డేటింగ్ పుకార్లకు చెక్ పెట్టింది.

Click here for Sara Ali Khan Instagram link

Advertisement

Next Story