రాయల్ లైఫ్ వదులుకుని.. సాధారణ అమ్మాయిగా జీవించేస్తోంది..

by Anjali |   ( Updated:2023-03-29 09:56:04.0  )
రాయల్ లైఫ్ వదులుకుని.. సాధారణ అమ్మాయిగా జీవించేస్తోంది..
X

దిశ, సినిమా: రాయల్‌ లైఫ్ అంటే ఏంటో తనకు తెలియదంటోంది సారా అలీఖాన్. నిజానికి తాను పటౌడీ ఫ్యామిలీకి చెందినప్పటికీ ఏ రోజు తనను తాను రాయల్టీగా భావించలేదని తాజా ఇంటర్య్వూలో వెల్లడించింది. తనకు లేని ఫీలింగ్స్‌ను కలిగించుకుని ప్రజలు తనను అలా చూడటం ఆశ్చర్యంగా ఉంటుందని చెప్పింది. ‘జనాలు అలా అనుకోవడం నాకు హాస్యాస్పదంగా అనిపిస్తుంది. నేను రాజకుటుంబం నుంచి రావచ్చు.. కానీ, ఇప్పుడు నాకు దానితో సంబంధం లేదు. సీరియస్‌గా రాయల్ అంటే ఏమిటో నాకు తెలియదు. నా జీవితంలో ఎక్కువ భాగం ముంబైలోని జుహులో మా అమ్మతో కలిసి జీవించాను. ముంబై అమ్మాయిగానే ఫీల్ అవుతాను. మా నాన్నను కలవడానికి బాంద్రా వెళ్తాను. సెలవుల్లో హిమాచల్ ప్రదేశ్, కేదార్‌నాథ్, జమ్మూలో గడుపుతాను. రాయల్టీతో సంబంధం లేకుండా సాధారణ జీవితాన్ని గడపడమే నాకు చాలా ఇష్టం’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.

ఇవి కూడా చదవండి: బన్నీకి అభినందనలు తెలిపిన చిరు.. గర్వంగా ఉందంటూ

Advertisement

Next Story