Sapthami Gowda : ఎన్నికల వేళ బాధ్యతను గుర్తుచేసిన కాంతారా హీరోయిన్

by Disha Web Desk 9 |
Sapthami Gowda : ఎన్నికల వేళ బాధ్యతను గుర్తుచేసిన కాంతారా హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంతారా సినిమా హీరోయిన్ సప్తమి గౌడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కాంతారా చిత్రంతో పాన్ ఇండియా లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీకి అనంతరం అన్ని ఇండస్ట్రీల నుంచి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇకపోతే తాజాగా సప్తమి గౌడ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. శుక్రవారం ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. కాగా, కర్ణాటకలో ఎన్నికల ప్రక్రియను రెండు దశలుగా విభజించారు. ఇవాళ రెండో ఎన్నికల పోలింగ్ నిర్వహించగా.. చాలా మంది కన్నడ సినీ ప్రముఖులు తమ తమ పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేసిన క్షణాల్లో కామెంట్లు, లైక్స్‌తో అభిమానులు చెలరేగిపోయారు. ఓటు వేయడం హక్కు వేయడం బాధ్యత.. ఎన్ని పనులున్నా వదులుకొని ఓటు వేసిన మీకు ధన్యవాదాలు అంటూ ప్రశంసిస్తున్నారు.

Read More..

బాబాయ్ కోసం రంగంలోకి కొడుకు.. ఫుల్ ఖుష్ అవుతోన్న మెగా ఫ్యాన్స్..!




Next Story