ఓవర్ డోస్ డ్రగ్స్ తీసుకున్న బాలీవుడ్ హీరో.. రెండు రోజులుగా నిద్రలోనే..

by sudharani |   ( Updated:2022-10-30 13:10:01.0  )
ఓవర్ డోస్ డ్రగ్స్ తీసుకున్న బాలీవుడ్ హీరో.. రెండు రోజులుగా నిద్రలోనే..
X

దిశ, సినిమా : బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్.. డ్రగ్స్ కారణంగా భయంకరమైన అనుభవం ఎదుర్కొన్నట్లు గుర్తుచేసుకున్నాడు. ఇటీవల ఓ ఇంటరాక్షన్‌లో పాల్గొన్న ఆయన.. డ్రగ్స్ తన జీవితంలో ఎలాంటి సంఘటనలకు దారితీశాయో క్లుప్తంగా వివరించాడు. 'డ్రగ్స్ గురించి మాట్లాడటం పనికిరాని విషయం. ఒకసారి రాత్రి చాలా మత్తులో ఇంటికి వచ్చాను. నేరుగా నా గదిలోకి వెళ్లి పడుకున్నా.

తర్వాత ఉదయం ఎనిమిది గంటలకు ఆకలిగా అనిపించి నిద్రలేచాను. ఎన్నో ఏళ్లుగా నా ఇంట్లో పనిచేస్తు్న్న వర్కర్ సాయం అడిగాను. నిన్న రాత్రి తినకుండా పడుకున్న నాకు ఆహారం ఇవ్వమని కోరాను. నిన్న నైట్ కాదు రెండు రోజుల క్రితం పడుకున్నావని ఆయన సమాధానమిచ్చాడు' అంటూ ఆ రోజుల్ని తలచుకుని ఎమోషనల్ అయ్యాడు. ఇక ఆ రోజుతో డ్రగ్స్ ముట్టుకోవద్దని నిర్ణయించుకున్నానన్న సంజయ్.. అత్యుత్తమమైన జీవితాన్ని డ్రగ్స్ నాశనం చేస్తాయని, నేటి యువత దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లొద్దని సూచించాడు.

నేను దగా చేసింది వారిని మాత్రమే.. పూరీ ఎమోషనల్ లెటర్ వైరల్

Advertisement

Next Story