- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అర్జున్ రెడ్డి’ సినిమా అల్లు అర్జున్‌తో చేయాల్సి ఉండే.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: యంగ్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఎంతటి సక్సెస్‌ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2017లో వచ్చిన ఈ మూవీతో సందీప్ రెడ్డి ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఇదే సినిమాను హిందీలోకి 2019 లో ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ అందుకున్నారు. ఇక అప్పటి నుంచి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా వరుస సినిమాలు చేస్తున్న సందీప్ రెడ్డి వంగా.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా అల్లు అర్జున్ చేయాల్సి ఉండే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆయన మాట్లాడుతూ.. ‘మొదట ‘అర్జున్ రెడ్డి’ సినిమా కోసం 2011లో అల్లు అర్జున్‌కు ఈ కథ వినిపించాను. అయితే.. ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత మళ్లీ ఐకాన్ స్టార్‌ను సంప్రదించాలనుకున్నాను కానీ అవకాశం రాలేదు. ఇక స్క్రిప్ట్ పలువురు నిర్మాతలు, నటీనటుల వద్దకు వెళ్లింది. చివరకు నేనే నిర్మించాలని నిర్ణయించుకున్నాను. ఒక స్నేహితుడు నన్ను విజయ్‌కి పరిచయం చేశాడు. దీంతో కొన్ని వారాల తర్వాత మేము షూటింగ్ ప్రారంభించి సినిమా రిలీజ్ చేశాం’ అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. కాగా.. తాజాగా ‘యానిమల్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు సందీప్.. త్వరలో అల్లు అర్జున్‌తో కలిసి పని చేయనుంన్నందుకు సంతోషిస్తున్నాను అని తెలిపారు.