- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి
దిశ, కామారెడ్డి :సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె నిరసనలో భాగంగా 20వ రోజు ఆదివారం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సమగ్ర శిక్ష ఉద్యోగుల ధూంధాం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపైన కోలాటాలు, నృత్యాలు, అసైదుల ఆటలతో ధూమ్ ధాం చేశారు. తాము పోరాటం శాంతియుతంగా చేస్తున్నామని, రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే విద్యా వ్యవస్థలో విద్యార్థులకు జరిగే నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని గుర్తు చేశారు. ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా సీపీ ఎస్ సంఘం జిల్లా నాయకులు ఎల్లారెడ్డి భాస్కర్ రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి తిరుమల్ రెడ్డి, ఇన్నారెడ్డిలు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు రాములు, శైలజ, సంతోష్ రెడ్డి వనజ, మంగ, శ్రీవాణి, శ్రీను, కాళిదాసు, కళ్యాణ్, లింగం, దినేష్, లావణ్య తదితరులు పాల్గొన్నారు.