వీలైతే క్షమించు అంటూ ఆ హీరోయిన్‌ను వేడుకున్న సందీప్ రెడ్డి వంగా.. అంత పెద్ద తప్పు ఏం చేశాడంటే?

by sudharani |   ( Updated:2023-12-25 15:07:50.0  )
వీలైతే క్షమించు అంటూ ఆ హీరోయిన్‌ను వేడుకున్న సందీప్ రెడ్డి వంగా.. అంత పెద్ద తప్పు ఏం చేశాడంటే?
X

దిశ, సినిమా : ‘యానిమల్’ సినిమా టేకింగ్‌ నెక్స్ట్ లెవల్ ఉందంటూ ఆర్జీవీ నుంచే ప్రశంసలు అందుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. కొందరు సినిమాలో వాయిలెన్స్ గురించి విమర్శించినా.. అవేవి పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాడు దర్శకుడు. కాగా ఇప్పటికే దాదాపు రూ. 900 కోట్లు వసూళ్లు చేసిన ఈ చిత్రం కాస్టింగ్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. సినిమా ఫ్లోర్‌పైకి వెళ్లే ఏడాది ముందే ఫిమేల్ లీడ్‌గా పరిణీతీ చోప్రాను సెలెక్ట్ చేసినట్లు తెలిపిన ఆయన.. కానీ పలు కారణాల వల్ల ఆమెను రష్మిక మందన్నతో రీప్లేస్ చేసినట్లు తెలిపాడు. కారణం కొన్ని పాత్రలు కొందరికి మాత్రమే సెట్ అవుతాయని.. పరిణీతిలో గీతాంజలిని చూడలేకపోయానని చెప్పాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్తే చాలా అప్‌సెట్ అయిందని.. ‘తప్పు నాదే కాబట్టి వీలైతే క్షమించాలని కోరాను’ అని వివరించాడు.

Read More..

YS రాజశేఖర్ రెడ్డితో రెబల్ స్టార్ ప్రభాస్.. రేర్ ఫొటో!

Advertisement

Next Story