తల్లి గురించి చెప్తూ ఏడ్చేసిన సందీప్ కిషన్.. ఆ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ వీడియో రిలీజ్

by Sujitha Rachapalli |   ( Updated:2024-05-21 09:24:56.0  )
తల్లి గురించి చెప్తూ ఏడ్చేసిన సందీప్ కిషన్.. ఆ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ వీడియో రిలీజ్
X

దిశ, సినిమా : హీరో సందీప్ కిషన్ గురించి మాట్లాడుతుంటే మన ఇంట్లో అబ్బాయి గురించి చర్చించుకున్నట్లు ఉంటుంది. 'ప్రస్థానం ' సినిమాలో యాంగర్ బాయ్ గా తన సినీ జర్నీ మొదలు పెట్టిన ఆయన.. హీరోగా డిఫరెంట్ ప్రాజెక్టులు ఎంచుకుంటూ మెప్పిస్తున్నాడు. ఈ మధ్య రిలీజ్ అయిన ' ఊరు పేరు భైరవ కోన ' కూడా సూపర్ సక్సెస్ కాగా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. నిర్మాతగా కూడా ప్రయోగాలు చేస్తున్న సందీప్.. ఇటు ఫుడ్ బిజినెస్ లోనూ రాణిస్తున్నాడు. ఇక ఇదిలా అంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన రీసెంట్ గా రిలీజ్ చేసిన వీడియో వైరల్ అయిపోయింది.

' నేను ఎప్పుడు షూటింగ్ కు వెళ్లినా వచ్చేసరికి అమ్మ నా బెడ్ పై టెడ్డి బెయిర్ లాంటి ఏదో ఒక బొమ్మ ఉంచి సర్ ప్రైజ్ ఇస్తుంది. నాకు సంతోషాన్ని పంచేందుకు ఇలా చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ గిఫ్ట్ ఇచ్చింది. మా నాన్న తెలుగువాడు. కానీ మేము చెన్నైలోనే ఉండేవాళ్లం. అయితే తెలుగుదనం పోకుండా ఉండేలా ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడేవాడు. అందుకే ఆయన ఆంధ్ర బ్యాంకులోనే ఎకౌంట్ ఓపెన్ చేసాడు. అప్పుడు బ్యాంకు నుంచి పిల్లలకు చిన్న కిడ్డీ బ్యాంక్ ఇచ్చారు. అందులోనే డబ్బులు దాచుకునే వాడిని. అయితే దాన్ని భద్రంగా దాచిన అమ్మ రీసెంట్ గా నేను ఇంటికి వచ్చేసరికి నా బెడ్ పై పెట్టింది. వెంటనే కన్నీళ్లు వచ్చాయి. ఇన్నిరోజులు దాచి పెట్టీ మరి నాకు జ్ఞాపకాలు అందించిన అమ్మకు థాంక్స్ ' అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు సందీప్.

Advertisement

Next Story