వీక్ మూమెంట్‌లో కమిట్ అయ్యా.. నటి స్టేట్‌మెంట్

by Anjali |   ( Updated:2023-03-29 08:52:26.0  )
వీక్ మూమెంట్‌లో కమిట్ అయ్యా.. నటి స్టేట్‌మెంట్
X

దిశ, సినిమా: ప్రముఖ నటి షానూర్ సనా బేగం ఓ సినిమాలో తను చేసిన రొమాంటిక్ సీన్ గురించి ఆసక్తికర విషయం బయటపెట్టింది. 2020లో వచ్చిన ‘మెట్రో కథలు’ వెబ్ సిరీస్‌లో బోల్డ్ పాత్రలో నటించి మెప్పించగా.. అలీ రెజాతో ఆమె చేసిన రొమాన్స్ సినివర్గాల్లో చర్చనీయాంశమైంది. కాగా దీనిపై తాజాగా స్పందించిన నటి.. ‘నేను ఆ రోల్ చేయడానికి కారణం డైరెక్టర్ కరుణ కుమార్, రైటర్ ఖాదీర్ బాబు. ‘మెట్రో కథలు’ సిరీస్‌లో మిడిల్ క్లాస్ మహిళ ఎంత స్ట్రగుల్ అవుతుందనేది చూపించారు. నా పాత్రని చాలా నీట్‌గా ప్రెజెంట్ చేశారు. ఆ సీన్‌లో చిన్న వీక్ మూమెంట్‌లో చేసిన తప్పు అది. అయినా అది నాకు బాగా నచ్చింది కాబట్టే నటించేందుకు ఒప్పుకొన్నా’ అని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి: మహేష్ నటించిన ఆ సినిమా నాకు నచ్చలేదు: నమ్రత


Advertisement

Next Story