ఇండస్ట్రీలో కొందరు పెద్దలు తొక్కడం వల్లే సినిమాలు చేయలేదా..? సంపూర్ణేష్ బాబు క్లారిటీ

by sudharani |   ( Updated:2023-10-26 08:08:50.0  )
ఇండస్ట్రీలో కొందరు పెద్దలు తొక్కడం వల్లే సినిమాలు చేయలేదా..? సంపూర్ణేష్ బాబు క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ‘హృదయ కాలేయం’ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు. వెరైటీ కంటెంట్‌తో సినిమాలు తీసి మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఆయన.. బిగ్ బాస్‌లో అడుగు పెట్టి బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత ‘మార్టిన్ లూథర్ కింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న సంపు.. తనపై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చాడు.

ఇంటర్వ్యూలో భాగంగా.. ‘ఇండస్ట్రీలో కొందరు మిమ్మల్ని తొక్కేయడం వల్లే మీరు పెద్దగా సినిమాలు చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. నిజమేనా..?’ అని ప్రశ్నించగా.. దీనికి స్పందించిన సంపు ‘అలాంటిదేం లేదు. నేను అందరితోను మంచిగానే ఉంటాను. నాకు అలాంటి ఇబ్బందులు ఏమీ ఎదురుకాలేదు. అనారోగ్యం కారణంగా సినిమాలు చేయలేదని వార్తలు వచ్చాయి. వాటిలో కూడా ఎలాంటి నిజం లేదు. నేను నటించిన మూడు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ‘మార్టిన్ లూథర్ కింగ్’ రిలీజ్ అనంతరం అవి కూడా ప్రేక్షకుల ముందుకు వస్తాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story