Sammathame: రొమాన్స్, ఎమోషన్స్‌తో సమ్మతమే

by samatah |   ( Updated:2022-06-17 10:06:54.0  )
Sammathame Movie Released On June 24
X

దిశ, సినిమా: Sammathame Movie Released On June 24| యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ చాందిని చౌదరి నటించిన 'సమ్మతమే' మూవీ జూన్ 24న రిలీజ్ కానుంది. మంత్రి కేటీఆర్ రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తుంటే.. సినిమా లవ్ అండ్ రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపి ఉన్నట్లు అర్థమవుతోంది. చిన్నప్పటి నుంచే పెళ్లి అంటే ఓ ప్రత్యేకమైన ఎమోషన్ ఉన్న అబ్బాయి.. తనతో పెళ్లికి ఒప్పుకున్న అమ్మాయితో ప్రయాణం చేశాక ఎలాంటి నిర్ణయానికి వచ్చాడు? హీరో ఓవర్ పోసెసివ్‌నెస్‌ను తట్టుకోలేని అమ్మాయి.. అబ్బాయికి చివరకు ఓకే చెప్పిందా లేక తన లైఫ్ నుంచి తప్పుకుందా? అనేది కథ. ఇక కామెడీ బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తుండగా.. ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

Next Story

Most Viewed